Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విధుల్లో చేరిన వింగ్ కమాండర్ అభినందన్.. చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసిన సహోద్యోగులు!

  • ఫిట్ నెస్ టెస్ట్ పాసైన అభినందన్!
  • తిరిగి విధుల్లో చేరిక
  • జమ్మూ ఎయిర్ బేస్ లో ఘనస్వాగతం
పాకిస్థాన్ జెట్ ఫైటర్ ను కూల్చివేసి, ఆపై శత్రుసైన్యానికి పట్టుబడినా అపారమైన గుండెనిబ్బరంతో దేశ రక్షణ రహస్యాలను కాపాడిన వైనం వింగ్ కమాండర్ అభినందన్ ను జాతీయ హీరోగా మార్చింది. పాక్ కస్టడీ నుంచి విడుదలయ్యే సమయానికి గాయాలతో బాధపడుతున్న అభినందన్ కు ఉన్నతస్థాయి వైద్యం అందించారు. ఇటీవల పూర్తిగా కోలుకుని వాయుసేన పరీక్షల్లో ఫిట్ గా తేలిన అభినందన్ తిరిగి విధుల్లో చేరినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో అభినందన్ జమ్మూకాశ్మీర్ లో తాను పనిచేస్తున్న ఎయిర్ బేస్ కు రాగా, సహోద్యోగులు ఘనస్వాగతం పలికారు. ఒక్కసారిగా చుట్టుముట్టి అభినందన్ ను ప్రశంసల వర్షంలో ముంచెత్తారు. ఈ సాహస పైలట్ తో ఫొటోలు తీసుకునేందుకు పోటీలు పడ్డారు. అభినందన్ కూడా చాలా రోజుల తర్వాత తన సహచరులను చూసి భావోద్వేగాలకు లోనయ్యారు. వారితో ఎంతో ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా అక్కడ భారత్ మాతా కీ జై అంటూ నినాదాలతో హోరెత్తిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

Abhinandan

More Telugu News